Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడ రైల్వేస్టేషన్ లోనూ ప్లాట్ ఫాం టికెట్ ధర పెంపు

దసరా పండగ నేపథ్యంలో ప్లాట్ ఫాంపై రద్దీని తగ్గించేందుకు గాను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ప్లాట్ ఫాం టికెట్ ను ధరను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా, ఆ జాబితాలోకి విజయవాడ రైల్వేస్టేషన్ కూడా చేరింది. ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలు ముగిసే వరకు ఈ టికెట్ ధర అమల్లో ఉంటుందని తెలిపారు.

More Telugu News